Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

SULLURUPET HISTORY


సూళ్ళూరు పేట చరిత్ర :
చెన్నై  నుండి 83 కి.మీ.ల దూరములోనూ,నెల్లూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, చక్కని రైలు మరియు రోడ్డు రవాణా సౌకర్యములు ఉన్నందువలన సూళ్లూరుపేటను కొన్నిసార్లు చెన్నై సబర్బ్ గా పరిగణిస్తారు. ఇక్కడ ఉద్యోగపరంగా చాలామంది తమిళులు నివాసం ఉంటున్నారు. అధికశాతం జనాభాకు తమిళం తెలుసు.


శ్రీ  చెంగామ్మ పరమేశ్వరి  దేవస్థానము ,సూళ్ళూరు పేట: 

ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన చెంగామ్మ గుడి ఉంది. తలపై నాగపడగ కలిగి ఎనిమిది చేతులతో ఉండే అమ్మవారు బహుళ ప్రసిద్ధి కలిగిన అమ్మవారు. స్థల పురాణం ప్రకారం కొన్ని వేల ఏళ్ళ పూర్వం ఈ ఊరిని శుభగిరి అని పిలిచేవారు. ఊరికి పశ్చిమంగా కాళంగి నది ప్రవహిస్తుండేది. కొందరు పశువుల కాపరులు ఈత కొరకు దిగగా అందులో ఒకడు సుళ్ళు తిగుతున్న నీటి ప్రవాహం లోనికి లాక్కుని పోతుండగా అసరాగా చేతులకు తగిలిన రాతిని పట్టుకోగా అది అతడిని ఆ సుళ్ళ ప్రవాహం నుండి బయట పడవేయగా అతడు తనతో పాటుగా ఆ రాతిని తీసుకొచ్చి మిగిలిన వారికి చూపి జరిగినది వారికి చెప్పాడు. చీకటి పడటంతో వాళ్ళు పొడవుగా ఉన్న ఆ శిలను అక్కడే పడుకోబెట్టి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం వచ్చి చూడగా పడుకోబెట్టిన రాయి దక్షిణాభిముఖంగా నిలబెట్టి ఉండటం మరియు అది ఒక స్త్రీమూర్తి విగ్రహం అని మహిషాసురమర్ధనిలా ఉండటం గమనించారు. దానిని ఊరి పొరిమేరలలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించగా ఎంతకూ కదలకపోవటం, ఆ రాత్రి ఊరి పెద్దకు కలలో కనిపించి తనను కదల్చవద్దని చెప్పడంతో అక్కడే ఒకపాక వేసి పూజలు చేయడం మొదలెట్టారు. కొంతకాలానికి గుడి నిర్మించిన తరువాత తలుపులు పెట్టేందుకు ప్రయత్నించగా అప్పుడూ కలలో కనబడి నా దర్శనానికి ఏ సమయంలో వచ్చినా ఇబ్బంది కలుగకూడదు కనుక తలుపులు పెట్టవద్దని హెచ్చరించినదట. మరునాడు చూడగా తలుపులు చేయడానికి తెచ్చిన చెక్కలపై మొక్కలు మొలిచి కనిపించాయట. అప్పటి నుండి ఆ మొక్కలు ఆ ఆవరణలోనే పెరిగి పెద్దవై ప్రస్తుతం చెంగామ్మ వృక్షంగా పిలవడం జరుగుతున్నది. ఈ చెట్టును సంతానం కోరి దర్శించుకొనేవారు అధికం.

ఇతర విశేషాలు:

  • సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రము, శ్రీహరికోట ఇక్కడే ఉండటము వలన ఇది నెల్లూరులో చాలా ముఖ్యమైన ప్రదేశమైనది.
  • నేలపట్టు పక్షి సంరక్షణాలయము ఇక్కడికి దగ్గరిలోనే ఉన్నది.
  • సూళ్ళూరుపేట కు దగ్గర గా పులికాట్ సరస్సు కలదు.
  • 5వ నంబరు జాతీయ రహదారి బెంగళూర్ నుండి ఒడిస్సా వెళ్లేది సూళ్ళూరుపేట మీదుగా వెళుతుంది.

గ్రామాలు:

  • వెలగలపన్నూరు
  • సుద్దమడుగుతాగేలు
  • అచుకట్ల
  • మంగనెల్లూరు
  • దమనెల్లూరు
  • సుగ్గుపల్లె
  • రామచంద్రగుంట
  • మతకముడి
  • ఉగ్గుముడి
  • మంగళంపాడు
  • ఇల్లుపూరు
  • కొన్నెంబట్టు
  • మన్నారుపొలూరు
  • వట్రపాలెం
  • కేసవరెడ్డిపాలెం
  • దావడిగుంట
  • సూళ్ళూరు (సూళ్ళూరుపేట)
  • పందలగుంట
  • సూళ్ళూరు జప్తికట్టుబడి
  • యెర్రబాలెం
  • నూకలపాలెం
  • నాదెన్లవారిఖంద్రిక
  • సర్వారెడ్డిఖంద్రిక
  • సామంతమల్లాం
  • అబక
  • జంగలపల్లె
  • కొమ్మినేనిపల్లె
  • కొత్తపొలూరు
  • మన్నెముతేరి
  • దేగలపాలెం
  • కె.సి.నారసిమ్హునిగుంట
  • గోపాలరెడ్డిపాలెం
  • కుదిరి
  • కుదిరితిప్పఖంద్రిక
  • అతకనితిప్ప
  • కొరిది
  • దమరాయ
  • కడపత్ర
  • పంత్రాంగం
  • శ్రీ హరికోట (షార్)

No comments:

Post a Comment